India Pakistan trade ban - Direct or indirect Import or transit of all goods originating in or exported from Pakistan, whether or not freely importable or otherwise permitted, shall be prohibited with immediate effect.
India Pakistan trade ban - సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాక్ ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఎదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పసరని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.
#IndiaPakistan #PahalgamAttack #TradeBan #ImportBan #NationalSecurity #PakistanImports #Diplomacy #IndianEconomy #BannedGoods
~HT.286~PR.358~CA.240~